ప్రతి ఆడబిడ్డకు రూ.1016 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా  :  బీమనపల్లి శోభ శ్రీనివాస్

ప్రతి ఆడబిడ్డకు రూ.1016 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా  :  బీమనపల్లి శోభ శ్రీనివాస్
  • 36వ వార్డు బీజేపీ అభ్యర్థి శోభ శ్రీనివాస్

రాజన్నసిరిసిల్ల, వెలుగు: తనను కౌన్సిలర్‌‌ ‌‌ గా గెలిపిస్తే పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.1016 ఫిక్స్​డ్​ డిపాజిట్ చేస్తానని 36వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి బీమనపల్లి శోభ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఆదివారం సిరిసిల్ల మున్సిపల్‌‌  36వ వార్డులో శోభ శ్రీనివాస్ ఇంటింటా ప్రచారం చేశారు.

ఆమె మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, గెలిపిస్తే 36వార్డులోని ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయిస్తానన్నారు. ఎవరు చనిపోయినా అంత్యక్రియల ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్​ సహకారంతో నిధులు తెచ్చి వార్డును అభివృద్ధి చేస్తానన్నారు.