ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

 ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  •     మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి(పెగడపల్లి)/గొల్లపల్లి, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి నేతృత్వంలో ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని కోరండ్లపల్లిలో రేషన్ దుకాణాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పథకాలను అమలుచేస్తున్నామన్నారు. 

మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కోరండ్లపల్లిలో రేషన్ దుకాణం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి గురువారం ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం నేరెళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన-– ప్రగతి ప్రణాళిక గ్రామసభలో మంత్రి పాల్గొన్నారు. గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామంలో గుండు హనుమాన్​ ఆలయంలో పూజలు చేశారు. 

మల్లాపూర్(ఇబ్రహీంపట్నం): మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో మార్క్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కె.సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి జువ్వాడి నర్సింగారావుతో కలిసి ప్రారంభించారు.