తెలంగాణ పవర్‌ ప్రాజెక్ట్‌ స్టేజ్2పై...  ఎన్టీపీసీతో తెలంగాణ సర్కారు అగ్రిమెంట్‌

తెలంగాణ పవర్‌ ప్రాజెక్ట్‌ స్టేజ్2పై...  ఎన్టీపీసీతో తెలంగాణ సర్కారు అగ్రిమెంట్‌
  • 800 మెగావాట్ల యూనిట్‌ ఏర్పాటు ఒప్పందంపై సంతకాలు చేసిన ఆఫీసర్లు

గోదావరిఖని, వెలుగు : తెలంగాణ పవర్‌ ప్రాజెక్ట్‌ స్టేజ్‌ 2కు సంబంధించి తొలి యూనిట్‌ ఏర్పాటుకు ఎన్టీపీసీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. స్టేజ్​2లో మొదటగా 8‌00 మెగావాట్ల యూనిట్‌ను నెలకొల్పనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఎన్‌పీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌ ఆఫీసర్లు, ఎన్టీపీసీ కమర్షియల్‌ వింగ్‌ మేనేజర్‌ కలిసి గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. తెలంగాణలో ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ను నెలకొల్పాలని ఆంధ్రప్రదేశ్​పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు.

ఇందులో భాగంగా స్టేజ్​-1 కింద 800 మెగావాట్ల సామర్థ్యం గల  రెండు యూనిట్ల నిర్మాణం పూర్తి కాగా ఉత్పత్తి కూడా మొదలు పెట్టారు. రెండో స్టేజీలో 800 మెగావాట్ల సామర్ధ్యంతో మూడు యూనిట్లు నిర్మించాల్సిఉంది.  పవర్‌పర్చేజ్​ అగ్రిమెంట్​జరగకపోవడంతో ఇన్నాళ్లు ప్రాజెక్ట్​ ముందుకు కదలలేదు. గురువారం తెలంగాణ డిస్కమ్‌ అధికారులకు, ఎన్టీపీసీ కమర్షియల్‌ వింగ్​ఆఫీసర్లకు మధ్య ఒప్పందం జరిగింది. ఎన్టీపీసీ తెలంగాణ స్టేజ్‌ 2లో 2,400 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణ బాధ్యతలు బీహెచ్‌ఈఎల్‌ దక్కించుకుంది.