బండి సంజయ్ పాదయాత్రకు ఆటోడ్రైవర్లు సంఘీభావం

బండి సంజయ్ పాదయాత్రకు ఆటోడ్రైవర్లు సంఘీభావం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్రకు ఆటో డ్రైవర్లు స్వచ్చందంగా సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో భాగంగా కర్మన్ ఘాట్ కు విచ్చేసిన బండి సంజయ్ ను పలువురు ఆటో డ్రైవర్లు కలిశారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసి.. సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లును ఆప్యాయంగా పలకరించిన బండి సంజయ్ వారి కోరిక మేరకు స్వయంగా ఆటోను నడిపారు. దీంతో ఆటో డ్రైవర్లు బండి సంజయ్ ను తమ వాడిగా భావిస్తూ ఎంతగానో సంతోషించారు.