బీజేపీ గందరగోళంలో ఉంది: శివసేన

బీజేపీ గందరగోళంలో ఉంది: శివసేన

ముంబై: మహారాష్ట్ర అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చే విషయంలో ప్రతిపక్ష బీజేపీ గందరగోళంలో పడిందని శివసేన పార్టీ విమర్శించింది. చాలా రాష్ట్రాల్లో అధికార ప్రభుత్వాలను అస్థిరపరచడం ద్వారా బీజేపీ పవర్‌‌ను చేజిక్కించుకుంటోందని శివసేన మౌత్‌పీస్ సామ్నా తన ఎడిటోరియల్‌లో దుయ్యబట్టింది. కరోనా క్రైసిస్‌ను బీజేపీ బాగానే హ్యాండిల్ చేస్తున్నప్పటికీ ఆ పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, గుజరాత్, కర్నాటకతోపాటు హరియాణాల్లో పరిస్థితి విషమిస్తోందని శివసేన చెప్పింది. రాష్ట్ర ఆసక్తులు, అభివృద్ధి కేవలం తామే నెరవేరస్తామని బీజేపీ కలల కంటోందని మండిపడింది. ‘ప్రస్తుతం శివసేన నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) రాష్ట్ర ఆసక్తులకు అనుకూలంగా ఉంది. బలవంతంగా కానీ హార్స్ ట్రేడింగ్ ద్వారా కానీ ఎంవీఏ సర్కార్‌‌ను కూల్చలేనందుకు బీజేపీ గందరగోళంగా ఉంది’ అని శివసేన వివరించింది.