- ప్రియాంకా గాంధీ
మలప్పురం: ఎన్నికల కమిషనర్లకు (ఈసీ) కల్పించిన చట్టపరమైన రక్షణలను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘాన్ని జవాబుదారీతనం నుంచి రక్షించేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ సేఫ్‌గార్డ్స్ తీసుకొచ్చిందని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా చేయాలన్నారు.
‘ఇండియా’ కూటమి మొత్తం ఈ డిమాండ్‌కు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కేరళలోని మలప్పురంలో విలేకరులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల కమిషనర్ ఏ తప్పు చేసినా రక్షించేలా బీజేపీ ప్రభుత్వం ఆయనకు చట్టపరమైన రక్షణ కల్పించింది. దీనిని తొలగించాలి’ అన్నారు.
