- జేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి కేరళలో లభించిన ‘ఆర్యదాన్ ముహమ్మద్ మెమోరియల్ బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు ప్రజల మెప్పుతో వచ్చినది కాదని, అది కేవలం ఎలక్షన్ ఫండ్ నజరానా అని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపిం చారు. భవిష్యత్ పోరు గాంధీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్ గా పోల్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అవార్డుల కోసం పాకులాడుతున్న సీఎంకి రాష్ట్రంలోని గురుకులాల్లో పసిబిడ్డలు పడుతున్న నరకం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గతంలో అమెరికాలో వారం రోజుల కోర్సును ఆస్కార్ అవార్డుతో పోల్చుకున్నట్లుగానే, ఇప్పుడు కేరళలో ఈ డూప్లికేట్ అవార్డును తీసుకున్నారని సెటైర్వేశారు. రేవంత్ రెడ్డి అసలు పనితీరుపై దృష్టి పెట్టడం లేదని, కనీసం తన శాఖ పరిధిలోని విద్యా వ్యవస్థను గాడిలో పెట్టలేదని విమర్శించారు.
