భజనలకు ఉన్న టైం.. ఈసీపై స్పందించేందుకు లేదా?..ప్రధానిని ప్రశ్నించిన కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే

భజనలకు ఉన్న టైం.. ఈసీపై స్పందించేందుకు లేదా?..ప్రధానిని ప్రశ్నించిన కర్నాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీకి భజన సమావేశాలకు హాజరవడానికి సమయం ఉంటుంది కానీ.. ఎన్నికల సంఘంపై తలెత్తుతున్న వివాదాలపై స్పందించడానికి టైం ఉండడం లేదని కర్నాటక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ప్రియాంక్ ఖర్గే విమర్శించారు. శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయానికి ఎదురుగా ఉన్న పార్కులో సంఘ్ పరివార్ సిద్ధాంతకర్త దీన్‌‌దయాళ్ ఉపాధ్యాయ్ 110వ జయంతిని నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన భజన్ క్లబ్బింగ్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమంలో ప్రధాని పాల్గొనడాన్ని ప్రశ్నిస్తూ ప్రియాంక్ ఖర్గే శనివారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని భజన్ క్లబ్బింగ్‌‌కు సమయం కేటాయిస్తూ.. ఈసీకి సంబంధించిన ప్రశ్నలపై మౌనం వహిస్తున్నారని ఖర్గే ఆరోపించారు.  గత 13 ఏండ్లుగా ప్రధాని ఇలాంటి ప్రశ్నల నుంచి తప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు.