ఎమ్మెల్యేలకు గిఫ్ట్ గా ఐఫోన్లు

ఎమ్మెల్యేలకు గిఫ్ట్ గా ఐఫోన్లు

రాజస్థాన్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కాస్ట్లీ ఫోన్లను గిఫ్ట్ ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్ సమర్పించిన తర్వాత మొత్తం 200 మంది ఎమ్మెల్యేలకు సరికొత్త ఐ ఫోన్లను బహుమతిగా ఇచ్చింది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం వాటిని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ఖజానాపై "ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని" ఐఫోన్‌లను తిరిగి ఇవ్వాలని వారంతా డిసైడ్ అయ్యారు.గత ఏడాది, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, మొత్తం 200 మంది ఎమ్మెల్యేలకు బడ్జెట్ కాపీతో పాటు ఐప్యాడ్‌లను అందించారు. 

సాధారణంగా, ఎమ్మెల్యేలకు బడ్జెట్ కాపీని బ్రీఫ్‌ కేస్‌లో ఇస్తారు, కానీ ఈసారి, వారికి లోపల ఐఫోన్ 13 ఉన్న లెదర్ బ్రీఫ్‌కేస్‌ను అందించారు. బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత సభను వాయిదా వేశారు. అనంతరం బయటకు వెళ్తున్న ఎమ్మెల్యేలకు ఎగ్జిట్ డోర్ వద్ద ఐఫోన్ 13న ఉన్న బ్రీఫ్ కేసులను బహుమతిగా అందించారు. ఎమ్మెల్యేలకు గిఫ్ట్ గా ఇచ్చిన ఫోన్ విలువ రూ.70000. 

అసెంబ్లీ ప్రస్తుతం పేపర్ లెస్ గా కొనసాగుతోంది. సభలోని సభ్యులను హైటెక్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందని అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు అన్నారు. కాగిత రహిత వ్యవస్థను, ఎమ్మెల్యేలను హైటెక్‌గా మార్చేందుకు ఈ స్మార్ట్‌ఫోన్‌లను పంపిణీ చేసినట్లు పీహెచ్‌ఈడీ మంత్రి మహేశ్ జోషి తెలిపారు. అయితే ఆ బహుమతిని తిరిగి ఇచ్చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయన్నారు. ‘మనందరికీ ఫోన్‌లు ఉన్నాయి, అది తప్పుడు ఉదాహరణగా నిలుస్తుంది. బీజేపీ ఎమ్మెల్యేలందరూ తమ ఫోన్లను తిరిగి ఇచ్చేస్తారు. అందరితో మాట్లాడతాం. సాధారణంగా బడ్జెట్‌లో బ్యాగ్ లేదా బ్రీఫ్‌కేస్ ఇవ్వబడుతుంది, ఇది అవసరం లేదు’ అంటూ బీజేపీ నేత గులాబ్ సి కటారియా పేర్కొన్నారు.
 

ఇవి కూడా చదవండి:

వేములవాడ రాజన్న హుండీ లెక్కింపు

రేపట్నుంచి నుమాయిష్ ప్రారంభం