విద్యార్థులకు క్షమాపణ చెప్పి.. కేంద్రమంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

 విద్యార్థులకు క్షమాపణ చెప్పి.. కేంద్రమంత్రి పదవికి  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

దేశంలో పేపర్ లీకేజీల వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలతో దేశంలో లక్షలాది మంది యువత భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యావ్యవస్థ మొత్తం ఒక దోపిడీ రాకెట్‌లా మారిపోయిందని రాహుల్ ఆరోపించారు.

ఈ పేపర్ లీకేజీల గందరగోళం, తీవ్ర ఒత్తిడి కారణంగా దాదాపు 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రే బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తప్పును కప్పిపుచ్చుకోవడమే కాకుండా, న్యాయం చేయాలని ప్రశ్నిస్తున్న విద్యార్థులను దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించడం అత్యంత దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

►ALSO READ | పాస్‌పోర్ట్, ఆధార్ ఉన్నంత మాత్రాన మీరు భారత పౌరులు కాదా? అసలు పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలేవి?

విద్యార్థుల పక్షాన నిలబడినందుకు తనపై కేంద్రం ఎన్ని దాడులు చేసినా, ఎంత ఒత్తిడి తెచ్చినా తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. బాధితులైన విద్యార్థులకు, అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తరపున తన పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.