రేపట్నుంచి నుమాయిష్ ప్రారంభం

రేపట్నుంచి నుమాయిష్ ప్రారంభం

రేపట్నుంచి నాంపల్లి నుమాయిష్ తిరిగి ప్రారంభం కానుంది. అఖిలభారత 81వ పారిశ్రామిక ప్రదర్శన 'నూమాయిష్‌' ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ ఎగ్జిబిషన్‌ను ఈ నెల 25న సాయంత్రం ప్రారంభించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. 46 రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. సాధారణ రోజుల్లో సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు, ప్రభుత్వ సెలవు రోజుల్లో రాత్రి 11 వరకూ కొనసాగుతుందని సౌసైటీ వర్గాలు తెలిపాయి. సుమారు 1600 స్టాళ్లు కొలువుదీరనున్నాయి. అయితే ఎగ్జిబిషన్ కే వచ్చే వారికి నో మాస్క్‌, నో ఎంట్రీ నిబంధనలు విధించారు. శానిటైజేషన్‌, థర్మల్‌ స్క్రీనింగ్ తర్వాతే సందర్శకులను అనుమతి ఇస్తారు. పిల్లలు, పెద్దలకు వినోదాన్ని కల్పించేందుకు అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 

సందర్శకులు సేదతీరేందుకు పార్క్ కూడా ఏర్పాటు చేశారు. రోజూ సాయంత్రం  మ్యూజికల్ నైట్ ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్టాళ్లతో పాటు, కశ్మీర్‌ ఉత్పత్తులకు నుమాయిష్‌ ప్రత్యేకం. కరోనా కారణంగా గత రెండేళ్లుగా నుమాయిష్ ఏర్పాటు చేయలేదు. ఈ సారి జనవరి1 న ప్రారంభమైన నుమాయిష్.. ఒమిక్రాన్ వ్యాప్తితో మూతపడింది. వైరస్ కేసులు పెరుగుతుండటంతో నుమాయిష్ నిలిపివేయాలని హైదరాబాద్ కమిషనరేట్ ఎగ్జిబిషన్ సొసైటీకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పట్లో ఆగిన నాంపల్లి ఎగ్జిబిషన్ తిరిగి ఇప్పుడు ప్రారంభం కానుంది. 

ఇవి కూడా చదవండి:

పీఆర్సీ బకాయిలను ఒకేసారి చెల్లించాలె

మల్లన్నసాగర్​లో షూటింగ్​లు చేయండి