టీఆర్ఎస్ పాలనలో ఆంధ్రా కాంట్రాక్టర్లే బాగుపడ్డరు

టీఆర్ఎస్ పాలనలో ఆంధ్రా కాంట్రాక్టర్లే బాగుపడ్డరు

కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకే LRS పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను దోపిడీ చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, LRSపై ప్రభుత్వ తీరుకు నిరసనగా బీజేపీ నేతలు సిద్దిపేటలో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడిలో ఆయన పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి హామీలపై కేసీఆర్ మాట తప్పారని ఆయన ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పాలనలో ఆంధ్రా కాంట్రాక్టర్లు, కల్వకుంట్ల కుటుంబీకులే బాగుపడ్డారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని వివేక్ విమర్శించారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు సిద్ధిపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.

‘రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుంది. ప్రజలకు డబుల్ బెడ్ రూమ్స్ ఆశ పెట్టి ఇవ్వడం లేదు. కరోనా సమయంలో ప్రజలను పీడించడానికే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌ను తీసుకొచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్ట్స్ పేరుతో ప్రజల సొమ్ము దోచుకుతింటుంది. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుంది. ప్రభుత్వం వెంటనే ఎల్ఆర్ఎస్ జీవోను క్యాన్సల్ చేయాలి’ అని ఆయన అన్నారు.

For More News..

లోన్ ఇప్పిస్తామంటూ టూరిస్ట్ గైడ్‌పై గ్యాంగ్ రేప్

ఫ్రెండ్స్‌తో వేసిన జోక్ నిజమైంది.. రూ. 12 కోట్ల లాటరీ గెలుచుకున్న 24 ఏళ్ల యువకుడు

వీడియో తీయమని లైవ్‌లో నదిలోకి దూకిన వ్యక్తి