బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్లదాడి..తప్పిన ప్రమాదం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై రాళ్లదాడి..తప్పిన ప్రమాదం

2021లో బెంగాల్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ త్వరలో ఎన్నికల ప్రచారం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షలు జేపీ నడ్డా, ముఖ్య నేత కైలాష్ లు బెంగాల్ బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

అయితే సమావేశానికి వచ్చిన నడ్డా, కైలాష్ ల కాన్వాయ్ లపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని అగంతకులు చేసిన దాడిలో కాన్వాయ్ అద్దాలు పగిపోయాయి. వెనుక సీట్లో కూర్చున్న నేతలకు ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో బీజేపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ దాడిపై బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ కేంద్ర నేతలకు సెక్యూరిటీ లేకపోవడం వల్లే తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) మద్దతు దారులు దాడి చేశారని అన్నారు. ఈ దాడితోనే టీఎంసీ అసలు రంగు బయటపడిందని మండిపడ్డారు.

 బీజేపీ నేతల ఆరోపణలపై తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ నేత మదన్ మిత్రా బీజేపీ సొంత గూండాలే హింసకు పాల్పడుతున్నారు” అని అన్నారు. ఈ దాడిలో టీఎంసీ ప్రమేయం లేదని ఖండించారు. స్థానికుల నిరసనలు “ప్రజల తిరుగుబాటు” అని మదన్ మిత్రా వ్యాఖ్యానించారు.

 మరో టీఎంసీ మంత్రి ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ బీజేపీ బయటి వ్యక్తులను రాష్ట్రంలోకి తీసుకువస్తోందని, ఆ విషయం బీజేపీ రాష్ట్రప్రభుత్వానికి చెప్పలేదని అన్నారు. ఒకవేళ తమకు సమాచారం అందించి ఉంటే భద్రత కల్పించి ఉండేవాళ్లమని చెప్పారు.