బెయిల్ పై విడుదలైన బీజేపీ ఎమ్మెల్యే

బెయిల్ పై విడుదలైన బీజేపీ ఎమ్మెల్యే

ప్రభుత్వ అధికారిపై క్రికెట్‌‌ బ్యాట్‌‌తో దాడి

ప్రభుత్వ అధికారిపై దాడి చేసి అరెస్టు అయిన ఇండోర్‌‌‌‌ బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్‌‌‌‌ నేత కైలాశ్‌‌ విజయ్‌‌వర్గియా కొడుకు ఆకాశ్‌‌ విజయ్‌‌ వర్గియ బెయిల్‌‌పై రిలీజ్‌‌ అయ్యాడు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. బీజేపీ పార్టీ ఆఫీస్‌‌ దగ్గర పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి సంబరం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆకాశ్‌‌ మీడియాతో మాట్లాడారు. “ ప్రజా ప్రయోజనాల కోసమే దాడి చేశాను. నేను చేసింది తప్పని అనుకోవడం లేదు. ప్రజల శ్రేయస్సు కోసం ఎప్పుడూ కృషి చేస్తాను. మరోసారి బ్యాట్‌‌ వాడే అవకాశం రాకుండా చేయాలని దేవుడ్ని కోరుకుంటున్నాను” అని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న ఇంటిని కూల్చేందుకు వచ్చిన ఒక ప్రభుత్వ అధికారిపై ఆకాశ్‌‌ క్రికెట్‌‌ బ్యాట్‌‌తో దాడి చేశారు. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. మెజిస్ట్రేట్‌‌ కోర్టు జులై 11 వరకు రిమాండ్‌‌ విధించగా.. భోపాల్‌‌ కోర్టు బెయిల్‌‌ మంజూరు చేసింది. ఫస్ట్‌‌ కేసుపైన 50వేల రూపాయలు, మరో కేసులో 20వేల రూపాయలు షూరిటీ బాండ్‌‌ ఇవ్వాలని ఆదేశించింది.