మాల వేసుకొని డ్యూటీకి రావొద్దని ఆర్డర్.. సీపీ పై మండిపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్

మాల వేసుకొని డ్యూటీకి రావొద్దని ఆర్డర్.. సీపీ పై మండిపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్

రాచకొండ సీపీ మహేష్ భగవత్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యప్పమాల వేసుకొని డ్యూటీకి రావొద్దని మెమో జారీ చేయడమేంటి? రంజాన్ సమయంలో ఇలాంటి మెమోలు రిలీజ్ చేయాలని అన్పించలేదా? హిందువులకు ఒక చట్టం, ముస్లింలకు ఒక చట్టమా? అని సీపీ పై మండిపడ్డారు

ముస్లింలకు రంజాన్ సమయంలో ఎలాంటి ఫ్రీడమ్ ఇస్తారో, హిందువులకు కూడా అలాంటి ఫ్రీడమ్ ఇవ్వాలని కోరారు. ఎవరి ఆదేశాల మేరకు మాల వేసుకొని విధుల్లోకి రావొద్దంటూ ఆర్డర్లు ఇచ్చారని  ప్రశ్నించారు. ఈ ఆదేశాలు పై నుండి వచ్చాయా? సీఎం నుండి వచ్చాయా? లేదా ఎంఐఎం ఆఫీసు నుండి ఈ మెమో రిలీజ్ అయితే అందరికి ఫార్వార్డ్ చేస్తున్నారా?  అని నిలదీశారు.

తెలంగాణ రాష్ట్రంలో అందరూ కలిసిమెలిసి ఉంటుండగా.. పోలీసుల్లో మాత్రం ఎందుకు ఈ తేడాలను తెస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రంజాన్ సమయంలో టోపీలు, గడ్డాలు తీసేయాలి మెమోలు జారీ చేయగలరా? అని రాజాసింగ్ సీపీ ని నిలదీశారు. అయ్యప్పమాల వేసుకున్న వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలని, లేదంటే జరిగే పరిణామాలపై మీరే బాధ్యత వహించాలని ఆయన తెలిపారు.

BJP MLA Rajasingh comments on rachakonda CP Mahesh Bhagwat

 

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి