Women's T20 World Cup 2024: ఒకే గ్రూప్‌లో ఇండియా, పాక్.. టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ విడుదల

Women's T20 World Cup 2024: ఒకే గ్రూప్‌లో ఇండియా, పాక్.. టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్ విడుదల

అక్టోబర్‌ 3 నుంచి బంగ్లాదేశ్‌ వేదికగా జరగనున్న మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్, గ్రూప్‌లను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఆదివారం(మే 03) ప్రకటించింది. టోర్నీలో తలపడే 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశలో ప్రతి జట్టు నాలుగు గ్రూప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇవి ముగిసేసరికి ప్రతి గ్రూప్ నుండి టాప్- 2లో నిలిచిన మొదటి రెండు జట్లు సెమీస్ కు అర్హత సాధిస్తాయి. 

ఆరుసార్లు ప్రపంచ కప్ విజేత, డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, భారత్, క్వాలిఫయర్ 1 జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. మరో గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్ 2 జట్లు ఉన్నాయి. ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ అక్టోబర్ 3న ఇంగ్లండ్ v దక్షిణాఫ్రికా మధ్య జరగనుండగా.. భారత జట్టు తొలి మ్యాచ్ లో అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో తలపడనుంది.

గ్రూప్ ఏ: ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, క్వాలిఫయర్ 1
గ్రూప్ బి: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, క్వాలిఫయర్ 2

మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్   

  • అక్టోబర్ 3: ఇంగ్లండ్ v దక్షిణాఫ్రికా (ఢాకా)
  • అక్టోబర్ 3: బంగ్లాదేశ్ v క్వాలిఫైయర్ 2 (ఢాకా)
  • అక్టోబర్ 4: ఆస్ట్రేలియా v క్వాలిఫైయర్ 1 (సిల్హెట్)
  • అక్టోబర్ 4: భారత్ vs న్యూజిలాండ్ (సిల్హెట్)
  • అక్టోబర్ 5: దక్షిణాఫ్రికా v వెస్టిండీస్(ఢాకా)
  • అక్టోబర్ 5: బంగ్లాదేశ్ v ఇంగ్లాండ్ (ఢాకా)
  • అక్టోబర్ 6: న్యూజిలాండ్ v క్వాలిఫైయర్ 1 (సిల్హెట్)
  • అక్టోబర్ 6: భారత్ vs పాకిస్థాన్ (సిల్హెట్)
  • అక్టోబర్ 7: వెస్టిండీస్ v క్వాలిఫయర్ 2 (ఢాకా)
  • అక్టోబర్ 8: ఆస్ట్రేలియా v పాకిస్థాన్ (సిల్హెట్)
  • అక్టోబర్ 9: బంగ్లాదేశ్ vs వెస్టిండీస్ (ఢాకా)
  • అక్టోబర్ 9: భారత్ vs క్వాలిఫైయర్ 1 (సిల్హెట్)
  • అక్టోబర్ 10: దక్షిణాఫ్రికా v క్వాలిఫయర్ 2 (ఢాకా)
  • అక్టోబర్ 11: ఆస్ట్రేలియా v న్యూజిలాండ్ (సిల్హెట్)
  • అక్టోబర్ 11: పాకిస్థాన్ v క్వాలిఫైయర్ 1 (సిల్హెట్)
  • అక్టోబర్ 12: ఇంగ్లండ్ v వెస్టిండీస్ (ఢాకా)
  • అక్టోబర్ 12: బంగ్లాదేశ్ v సౌతాఫ్రికా (ఢాకా)
  • అక్టోబర్ 13: పాకిస్థాన్ v న్యూజిలాండ్ (సిల్హెట్)
  • అక్టోబర్ 13: భారత్ vs ఆస్ట్రేలియా (సిల్హెట్)
  • అక్టోబర్ 14: ఇంగ్లాండ్ v క్వాలిఫైయర్ 2 (ఢాకా)
  • అక్టోబర్ 17: సెమీ ఫైనల్ 1 (సిల్హెట్)
  • అక్టోబర్ 18: సెమీ ఫైనల్ 2 (ఢాకా)
  • అక్టోబర్ 20: ఫైనల్ (ఢాకా)