- మహంకాళి స్వామికి పదవి దక్కనున్నట్లు ప్రచారం
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌కు కాబోయే మేయర్ పేరును సూచిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి.. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ఆదివారం సీల్డ్ కవర్ అందజేశారు. ఈ సీల్డ్ కవర్‌లో మహంకాళి స్వామి పేరును మేయర్‌గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా రామగుండం మేయర్ పదవి ఎస్సీకి రిజర్వ్ కాగా.. ఆ పదవి కోసం మహాంకాళి స్వామితోపాటు నెలకంటి రాము, మడిపెల్లి విజయ, యుగంధర్ పోటీలో ఉన్నారు. వీరిలో మహాంకాళి స్వామి వైపే సీఎం మొగ్గినట్లు తెలుస్తోంది. కాగా గత పాలకవర్గంలో మహంకాళి స్వామి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు.
సోమవారం ఉదయం 11 గంటలకు రామగుండం కార్పొరేషన్ ఆఫీస్‌లో జడ్పీ సీఈవో ఆధ్వర్యంలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మేయర్ ఎన్నిక జరగనున్నది. హైదరాబాద్ క్యాంపు నుంచి కార్పొరేటర్లు నేరుగా సోమవారం ఉదయం రామగుండం కార్పొరేషన్ ఆఫీస్‌కే రానున్నారు. మేయర్ పదవికి 31 సంఖ్యా బలం ఉండాల్సి ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు 38 మంది గెలవగా.. ఇతర పార్టీల నుంచి వచ్చినవారితో ఆ సంఖ్య 47కు చేరింది.
