శంకరపట్నం మండలం లో తాళం వేసి ఉన్న రెండిండ్లలో చోరీ 

 శంకరపట్నం మండలం లో తాళం వేసి ఉన్న రెండిండ్లలో చోరీ 

శంకరపట్నం, వెలుగు: శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో తాళం వేసిన రెండిండ్లలో చోరీలు జరిగాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తగట్టు గ్రామానికి చెందిన పేసరి రాజేశ్వరి కుటుంబం, మడ్డి రమ– శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దంపతులు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండేవారు. శనివారం వారు స్వగ్రామానికి రాగా ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగలు చోరీలు చేశారు.

రాజేశ్వరి ఇంట్లో బీరువాలో ఉన్న తులంన్నర బంగారం, 30 తులాల వెండి నగలు, 20వేల నగదు, మడ్డి రమ– శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దంపతులు ఇంట్లో అర తులం బంగారంఎత్తుకెళ్లారు. ఇదే గ్రామానికి చెందిన మాడ వెంకట్ రెడ్డి తన బైక్ ను శనివారం రాత్రి ఇంటి ముందు పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. తెల్లారి చూసేసరికి బైక్ కన్పించలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు.