విమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌: పాకిస్తాన్‌‌‌‌పై అమ్మాయిలూ గెలిచారు

విమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌: పాకిస్తాన్‌‌‌‌పై అమ్మాయిలూ గెలిచారు

బ్యాంకాక్: టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో టీమిండియా.. పాకిస్తాన్‌‌‌‌ను చిత్తు చేస్తే..  విమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌‌‌‌లో ఇండియా అమ్మాయిలు కూడా దాయాదిని దంచేశారు.  ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో  రాధా యాదవ్  కెప్టెన్సీలోని ఇండియా యంగ్‌‌‌‌ స్టర్స్ 8 వికెట్ల తేడాతో పాక్‌‌‌‌పై  ఘనవిజయం సాధించారు.   టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన పాక్‌‌‌‌  18.5 ఓవర్లలో  93 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. కెప్టెన్ రాధ (2/11),  సైమా ఠాకూర్ (2/14), ప్రేమ రావత్ (2/16) దెబ్బకు పాక్ బ్యాటర్లు  పెవిలియన్‌‌‌‌కు క్యూ కట్టారు.

షవాల్‌‌‌‌ జుల్ఫికర్ (23) టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌.  పాక్‌‌‌‌ బ్యాటర్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్‌‌‌‌కే పరిమితం అయ్యారు. అనంతరం వ్రిందా దినేష్ (29 బాల్స్‌‌‌‌లో 12 ఫోర్లతో 55 నాటౌట్) మెరుపు ఫిఫ్టీతో ఇండియా 10.1 ఓవర్లలోనే 97/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. అనుష్క శర్మ (24) కూడా రాణించింది. వ్రిందాకు ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.