Anchor Ravi: యాంకర్ రవి భారీ స్టేట్‌మెంట్.. టాలీవుడ్ ఫ్యూచర్ మెగాస్టార్ అతనే..!

Anchor Ravi: యాంకర్ రవి భారీ స్టేట్‌మెంట్.. టాలీవుడ్ ఫ్యూచర్ మెగాస్టార్ అతనే..!

ప్రముఖ తెలుగు యాంకర్ రవి, వెండితెర, బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు. ‘పటాస్’, ‘ఆడాళ్ల మజాకా’, ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, ‘సంథింగ్ స్పెషల్’ వంటి పాపులర్ ప్రోగ్రామ్స్‌తో అలరిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఒకవైపు హోస్ట్‌గా రాణిస్తూనే, మరోవైపు క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల రవి ఓ షోలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌కు కాబోయే మరో మెగాస్టార్ విజయ్ దేవరకొండ అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

యాంకర్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ షోకు రవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తాను నటించిన మ్యూజిక్ ఆల్బమ్ ప్రమోషన్ కోసం ఫ్రెండ్స్ తో కలిసి వచ్చిన ఆయన, తనదైన కామెడీ టైమింగ్‌, సరదా వ్యాఖ్యలతో కార్యక్రమాన్ని ఆసక్తికరంగా మార్చేశారు.

ఇంటర్వ్యూలో భాగంగా విజయ్ దేవరకొండ గురించి రవి ప్రశంసలు కురిపించారు. “విజయ్ దేవరకొండ నిజంగా బంగారు కొండ. నా విషయంలో ఆయన ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఏ సహాయం అడిగినా కాదనకుండా ముందుకు వస్తారు. ఆయన ప్రతి సినిమా నేను చూస్తాను, నా అభిప్రాయం కూడా చెబుతాను. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆయన హార్డ్‌వర్క్ మాత్రం తగ్గదు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఆయనకు ఎలాంటి భయం లేదు. తన బలాలు, బలహీనతలు ఆయనకు బాగా తెలుసు. ఒక మార్గాన్ని నమ్ముకుని కష్టపడుతూ ముందుకు సాగుతారు,” అంటూ రవి చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రక్రమంలోనే రవి-విజయ్ మధ్య ఉన్న స్నేహం మరోసారి స్పష్టమవగా, ఫ్యాన్స్ కూడా ఈ కామెంట్స్‌ను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ విషయానికి వస్తే... 

రౌడీ హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస పరాజయాలతో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్, కింగ్‌డమ్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆయన కెరీర్ గ్రాఫ్ దిగజారింది. ఈ పరిణామాలతో విజయ్ దేవరకొండ అభిమానుల ఆశలు క్రమంగా చల్లారుతున్నాయి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ రౌడీ జనార్థన్ మూవీలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. స్వాతంత్ర్యానికి పూర్వపు కాలం నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా రూపొందనుందని సమాచారం. కథలో ఉత్కంఠభరితమైన అంశాలు, బలమైన భావోద్వేగాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది.