జమ్మికుంట, వెలుగు: ఎస్సారెస్పీ కాలువ దాటుతుండగా తొక్కిసలాట జరిగి 58 గొర్రెలు చనిపోయాయి. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామానికి చెందిన వీరయ్యకు చెందిన గొర్రెలను బకత రమేశ్, రాజు మేపేందుకు ఆదివారం తీసుకెళ్లారు.
మార్గమధ్యలో ఎస్సారెస్పీ కాలువ దాటుతుండగా ఒకదానిపై ఒకటి పడడంతో 58 గొర్రెలు చనిపోయాయి. మృతి చెందిన గొర్రెల విలువ సుమారు రూ.7 లక్షల పైగా ఉంటుందని యజమాని వీరయ్య తెలిపారు.
