మహా ప్రభుత్వంలో ఫడ్నవీస్ భాగం కావాలి

మహా ప్రభుత్వంలో ఫడ్నవీస్ భాగం కావాలి

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అని ప్రకటించిన దేవేంద్ర ఫడ్నవీస్పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు. షిండేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి..ఫడ్నవీస్ గొప్ప మనసు చాటుకున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోమని ఫడ్నవీస్ ప్రకటించడం సరైంది కాదన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ తప్పకుండా ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించినట్లు చెప్పారు. తాను కూడా వ్యక్తిగతంగా ఆయన్ను అభ్యర్థించానని జేపీ నడ్డా చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టాలని కేంద్ర నాయకత్వం ఫడ్నవీస్ను  కోరినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నేరవేర్చాలని సూచించామన్నారు.