బీజేపీకి బిగ్ షాక్ : జాతీయ అధికార ప్రతినిధి రాజీనామా

బీజేపీకి బిగ్ షాక్ : జాతీయ అధికార ప్రతినిధి రాజీనామా

BJP Spokesperson Resigns: బీజేపీకి జాతీయ స్థాయిలో బిగ్ షాక్.. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అధికారికంగా.. స్వయంగా ప్రకటన చేయకపోయినా.. జాతీయ మీడియాలో కథనాలు రావటం కలకలం రేపుతోంది. ఓ వైపు నీట్ పేపర్ లీక్ ఆందోళనలు, రామ మందిరం విరాళాల దోపిడీ అంశాలపై బీజేపీ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే జాతీయ అధికార ప్రతినిధి.. టీవీ డిబేట్లలో పార్టీ తరపున గట్టిగా తన వాయిస్ వినిపించే షెహజాద్ పూనావాలా రాజీనామా చేశారనే వార్తలు చర్చనీయాంశం అయ్యాయి. 

షెహజాద్ పూనావాలా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అనే తన హోదాను తొలగించటం చూస్తుంటే.. ఆయన రాజీనామా చేసినట్లే అంటున్నారు. తన బయో అప్ డేట్ చేశారు. మతం ఇస్లాం.. సంస్కృతి హిందూ.. సిద్దాంతం భారతీయత, రచయిత జీఎస్టీకి యాత్ర, నరేంద్ర మోదీకి జీవితకాల అనుచరుడిని అంటూ రాసుకొచ్చారు. 

వ్యక్తిగత కారణాల వల్లే పార్టీ పదవులను రాజీనామా చేస్తున్నట్లు.. బీజేపీ హైకమాండ్ కు సెహజాద్ పూనావాలా రాజీనామా లేఖ సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై పూనావాలా అధికారికంగా స్పందించలేదు.. ఇక బీజేపీ పార్టీ హైకమాండ్ మౌనంగానే ఉంది. 

2017లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు షెహజాద్ పూనావాలా. బీజేపీ పార్టీ తరపున టీవీ చర్చల్లో రెగ్యులర్ గా కనిపిస్తుంటారాయన. బీజేపీ పార్టీకి, ప్రధాని మోదీకి అనుకూలంగా గట్టిగా తన వాయిస్ జాతీయ అధికార ప్రతినిధుల్లో పూనావాలా ఒకరు. అలాంటి వ్యక్తి.. ఇంత అకస్మాత్తుగా రాజీనామా చేయటం ఏంటనే చర్చ నడుస్తుంది. వ్యక్తిగత కారణాలతో రాజీనామా అని వార్తలు వస్తున్నా.. ఆ వ్యక్తిగత కారణాలు ఏంటీ అనేది ఇప్పటి వరకు తెలియలేదు.

ALSO READ : పార్లమెంట్ లో రామ మందిరం విరాళాల దోపిడీపై పప్పూయాదవ్, రాహుల్ గాంధీ స్కిట్

తన రాజీనామాపై పార్టీ హైకమాండ్ స్పందించిన తర్వాతనే.. తాను  ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ప్రకటన చేసే ఉద్దేశంలో.. షెహజాద్ పూనావాలా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.