ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంటి దగ్గర బీజేపీ ఆందోళన చేపట్టింది. కొత్త లిక్కర్ పాలసీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో మనీశ్ సిసోడియా ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నిరసనకారులను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
బీజేపీ కార్యకర్తలు పలు చోట్ల రోడ్లను దిగ్బంధించారు. ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీస్, అక్షర్ ధామ్, రింగ్ రోడ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరోవైపు వైన్ షాపులకు లైసెన్సుల కేటాయింపుపై అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరపాలని గతంలోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేశారు.
