కేటీఆర్.. దమ్ముంటే రాజీనామా చేసి చూపించు

కేటీఆర్.. దమ్ముంటే రాజీనామా చేసి చూపించు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బీజేపీ అధికారి ప్రతినిధి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కు మగసిరి ఉంటే రాజీనామా చేసి చూపించాలని సవాల్ విసిరారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో “వేరే పార్టీలతో మనకు పోటీ లేదు.. మా బావకు నాకే పోటీ ఉందని” సవాల్ విసిరిన కేటీఆర్ కు అహంకారమే తన చెల్లెల్ని ఓడగొట్టిందన్నారు. కరీంనగర్ లో ఆయన మెజారిటీ ని 80వేల నుంచి 4900 తగ్గించిందన్నారు.

“ హిందు గాళ్ళు, బొందు గాళ్ళు  అన్న మీ నాయనకు కరీంనగర్ ప్రజలు ఏం తీర్పు ఇచ్చిండ్రో మరిచావా” అంటూ చురకలు అంటించారు. “మా పార్టీ భూస్థాపితం కాదు,  కొద్ది రోజులు ఓపిక పడితే మీ పార్టీని మీరే భూస్థాపితం చేసుకుంటారని” రఘునందన్ హెచ్చరించారు.