హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ బుధవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘తెలంగాణలో ఓ కేసు ఉందనే విషయాన్ని దాచటం వల్ల మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ బ్యాచ్, మీడియాలోని వారి భజన బృందం గొంతు చించుకుని అరుస్తున్నారు.
అసలు ఆ తెలంగాణ కేసును బయటపెట్టిందే కాంగ్రెస్ నేతలు. వారు దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు’’ అని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మీ పార్టీలోని సమాచార లీకేజీని అడ్డుకోవాలని కాంగ్రెస్కు సంతోష్ సూచించారు.
