నీట్ పేపర్ లీక్ పై సీజేపీ నిరసన ముగిసిందో లేదో.. అప్పుడే E20 పెట్రోల్ వివాదం రాజుకుంది. ఒకవైపు వాహనదారులు జంతర్ మంతర్ లో ఆందోళనకు సిద్ధమవుతున్న వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) భారీ ఎత్తున ఉద్యమాన్ని క్యాప్చర్ చేసే వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ మాజీ సీఎం ఆర్వింద్ కేజ్రీవాల్ శనివారం (ఆగస్టు 1) చేసిన ప్రకటన సంచలనంగా మారింది.
ఈ20 పెట్రోల్ పై ప్రధాని మోదీ ఇంటిని ముట్టడిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ20 ఇంధన విధానంపై ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లను ప్రధానికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 4న ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిని ముట్టడించనున్నట్లు ప్రకటించారు.
సుమారు 100 మందితో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని నివాసానికి చేరుకుంటానని తెలిపారు. ఈ టౌన్ హాల్ ప్రకటనను దాదాపు ఏడు లక్షల మంది ఆన్‌లైన్‌లో చూశారని చెప్పారు. వాహనదారులు మూడు ప్రధాన డిమాండ్లను హైలెట్ చేస్తూ కేంద్రానికి హెచ్చరికలు పంపారు.
ALSO READ : ఉత్తరాంధ్రను కోస్టల్ ఎకనామిక్ కారిడార్ గా అభివృద్ధి చేస్తాం
- పెట్రోల్ పంపుల్లో కస్టమర్లకు సాధారణ పెట్రోల్, ఈ20 ఫుయెల్ ఎంపిక చేసుకునే అవకాశం ఉండాలి.
- ప్రస్తుతం లీటర్‌కు రూ. 84 ఉన్న పెట్రోల్ ధరలను తగ్గించాలి.
- ఇథనాల్ ధరలను తగ్గించాలి.
ఈథనాల్ బ్లెండెడ్ ఫుయెల్ విధానం అమెరికా ఒత్తిడితో అమలు అవుతోందని ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తిదారు అమెరికా భారత్ ను మరింత ఇథనాల్ కొనుగోలు చేసేలా ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది అమెరికా నుంచి 2.5 బిలియన్ డాలర్ల విలువైన ఇథనాల్ దిగుమతి చేసుకోనున్నట్లు ఆయన ఆరోపించారు. ప్రజల డిమాండ్లను ప్రధాని మోదీకి నేరుగా అందజేసేందుకు ఈ మార్చ్ చేపడుతున్నట్లు చెప్పారు.
