
గ్యాస్ సిలిండర్ల స్టోర్‌హౌస్‌లో జరిగిన పేలుడులో నలుగురు మరణించారు. ఈ ఘటన సిరియాలోని అలెప్పోలో జరిగింది. శుక్రవారం సిరియాలోని అలెప్పోకి చెందిన ఒక పట్టణంలో వంట గ్యాస్ సిలిండర్ల స్టోర్‌హౌస్‌లో ఈ పేలుడు సంభవించింది. పేలుడు వల్ల నలుగురు మరణించగా.. 23 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి స్టోర్‌హౌస్ చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ దెబ్బతిన్నాయి.