చంద్రుడిపై ఎకరం భూమి కొన్న బర్త్ డే బాయ్

చంద్రుడిపై ఎకరం భూమి కొన్న బర్త్ డే బాయ్

చాలామంది గతంలోనే చంద్రుడిపై భూమి కొన్నారు. బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ఈ మధ్యే చనిపోయిన సుశాంత్ సింగ్ కూడా చంద్రుడిపై భూమి కొనుగోలు చేశారు. తాజాగా బోధ్ గయకు చెందని నీరజ్ కుమార్ అనే వ్యాపారవేత్త కూడా తన పుట్టినరోజున చంద్రునిపై ఒక ఎకరం భూమిని కొన్నాడు. దాంతో నీరజ్ కుమార్ బోధ్ గయాలో చంద్రునిపై భూమి కొన్న తొలి వ్యక్తి అయ్యాడు.

తాను ఎల్లప్పుడూ చంద్రుడి వద్దకు వెళ్లాలని కోరుకునేవాడినని.. అయితే అది సాధ్యం కానందున.. అక్కడ భూమి కొనాలని నిర్ణయించుకున్నానని కుమార్ తెలిపాడు. తాను ఆ భూమి కొనడానికి తక్కువ మొత్తం మాత్రమే చెల్లించానని, కానీ, ఆ ప్రక్రియ చాలా క్లిష్టమైనదని ఆయన అన్నారు.

‘షారూఖ్ ఖాన్, ఇటీవల మరణించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరియు చంద్రునిపై భూమిని కొన్న చాలామంది వార్తలలో చూశాను. వారిని చూసిన తర్వాత నేను కూడా దాని గురించి సమాచారాన్ని సేకరించడం ప్రారంభించాను. చంద్రుడిపై భూమి కొనడం అనేది ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుందని నాకు తెలుసు. యూఎస్ కు చెందిన ‘లూనా సొసైటీ ఇంటర్నేషనల్’చంద్రునిపై భూమిని అమ్ముతుందని తెలిసింది. అప్పుడు నేను గూగుల్ ద్వారా సొసైటీని సంప్రదించాను. అక్టోబర్‌ 2019లో ఒక ఎకరం భూమి కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఆ సమయంలో నేను కేవలం రూ .48,000 మాత్రమే చెల్లించాను. అయితే చాలా పేపర్ వర్క్ ముగిసిన తర్వాత.. నాకు భూమి శాంక్షన్ అయినట్లు జూలై 4, 2020న నాకు మెసెజ్ వచ్చింది. అయినా సరే నాకు అవకాశం వస్తే మాత్రం.. నేను చంద్రుడి వద్దకు వెళ్ళడానికి ఇష్టపడతాను’ అని నీరజ్ కుమార్ తెలిపారు.

For More News..

ఫేస్‌బుక్ ఖాతా కావాలా? ఆర్మీ ఉద్యోగం కావాలా?

వీడియో: ఆవును విడిచి ఉండలేని ఎద్దు.. ఆవుతో పాటు..

వీసాల రద్దు విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్