Double iSMART Teaser: సౌండ్ దద్దరిల్లేలా డబుల్ ఇస్మార్ట్ టీజర్.. డైలాగ్స్తో పూరీ జగన్నాథ్ ఇచ్చిపడేసిండు

Double iSMART Teaser: సౌండ్ దద్దరిల్లేలా డబుల్ ఇస్మార్ట్ టీజర్.. డైలాగ్స్తో పూరీ జగన్నాథ్ ఇచ్చిపడేసిండు

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ డబల్ ఇస్మార్ట్(Double Ismart). టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannadh) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dut)  విలన్గా  చేస్తున్నారు.

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.ఈ టీజర్ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.పూరి మార్క్ లెవల్లో డైలాగ్స్ అదిరిపోయాయి. దిమాక్ కిరి కిరి.. అంటూ మరోసా తన మార్క్ డైలాగ్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. 85 సెకన్లు ఉన్న ఈ టీజర్‌ను చూస్తే..ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ ఇస్మార్ట్ అంటూ రామ్ మాస్ అవతారం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. 'కిరాక్ పొరొస్తే సైట్ మార్..ఖతర్నాక్ బీట్ వస్తే స్టెప్ప మార్..అంటూ రామ్ ఎనర్జీని చూపించాడు పూరీ. అలాగే నాక్ తెల్వకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గు..కాలుతది..ఒక్కొక్కని మొలకి లడీ కడ్తా..గ్రానెట్ గుచ్చి పిన్ను పిక్తా..అంటూ రామ్ మాస్ ని చూపించాడు పూరీ.. 

ఇక స్టోరీ ఎక్కడ  రివీల్ చేయ‌కుండా మ‌రోసారి ఇస్మార్ట్ శంక‌ర్ రోల్‌లో ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపించాడు రామ్. ఈ సారి ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ టీజర్ తో పూరి..రామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ షురూ చేయడం ఫిక్స్. బ్యాక్ గ్రౌండ్ సౌండ్ దద్దరిల్లేలా మ్యూజిక్ వర్క్ లో మణిశర్మ పనితనం కనిపిస్తుంది. 

అలాగే డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా లెవల్లో రానుంది కాబట్టి ఆ రేంజ్ కు తగ్గట్టుగా కొత్త మ్యూజిక్ వినిపించడానికి మణిశర్మ గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా రానున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ అత్యున్నత ప్రమాణాలతో వస్తుండగా ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి. ఈ హిట్ రామ్, పూరీకి చాలా అవసరం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా పూరీ ముంబైలో డబుల్‌ ఇస్మార్ట్‌ క్లైమాక్స్ ఫైట్ సీన్‌ ప్లాన్ చేశాడని..ఈ సీన్‌ కోసం ఏకంగా రూ.7 కోట్లు పెడుతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆలీ, కావ్య థాపర్‌, షియాజీ షిండే, ఉత్తేజ్, గెటప్ శీను త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌కపాత్ర‌లు పోషిస్తున్నారు.