
దసరా(Dasara) సినిమాలో నానికి ఫ్రెండ్ క్యారెక్టర్‌లో నటించిన హీరో దీక్షిత్ శెట్టి (Dixit Shetty)..ఈ చిత్రంతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.సూరి పాత్రలో తన నటన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.దీక్షిత్ కన్నడ నటుడు అయినప్పటికీ తీసిన ఒక్క సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు పొందాడు.ఇపుడు ఈ హీరో అటు తెలుగు ఇటు కన్నడలో వరుస సినిమాలు చేస్తున్నాడు.
లేటెస్ట్ గా ఈ హీరో నుండి మార్చి 8న థియేటర్లలోకి వచ్చిన మూవీ 'బ్లింక్'(Blink).ఇదొక మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ. తొలుత 50 కంటే తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు మేకర్స్.ఈ సినిమాకు ఫస్ట్ టాక్ బాగుండటంతో థియేటర్ల నంబర్ పెరిగింది. దీంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో పాటు..కలెక్షన్ల వర్షం కురిపించింది.ఇండియన్ ఫస్ట్ మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకున్నది.
థియేటర్లలో ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చింది.బ్లింక్ మూవీ మంగళవారం మే 15నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.ప్రస్తుతం కేవలం కన్నడ వెర్షన్‌ను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్.త్వరలోనే తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో బ్లింక్ సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ తెలిపారు. బ్లింక్ మూవీకి శ్రీనిధి బెంగళూరు దర్శకత్వం వహించగా..మందాత హీరోయిన్‌గా నటించింది.
బ్లింక్ కథ:
పీజీలో ఫెయిల్ అయిన కుర్రాడు అపూర్వ(దీక్షిత్ శెట్టి).తల్లి దగ్గర ఈ విషయం దాచి, పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. స్వప్న(మందాత)తో ప్రేమలో ఉంటాడు. మంచి జాబ్ చేసి సెటిల్ కావాలనుకుంటాడు.అలాంటిది తండ్రి గురించి తెలిసిన ఓ సీక్రెట్ ఇతడి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కనురెప్పల్ని మూస్తే టైమ్ ట్రావెల్‌లో ముందుకు వెనక్కి వెళ్తుంటాడు? కంటిరెప్పలను మూయకుండా నియత్రించే శక్తి అపూర్వకు ఎక్కడి నుంచి వచ్చింది? అదే అతడి లైఫ్‌ను ఎలా కష్టాల్లోకి నెట్టింది? కంటి రెప్పలను మూసిన మరుక్షణం టైమ్ ట్రావెల్‌లో అతడు ముందుకు..వెనక్కి ఎలా వెళ్లాడు అన్నదే బ్లింక్ మూవీ కథ.అసలు ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ?