పాపులార్టీ అంటే ఇదే.. ఒక్క పోస్టుకు రూ. కోటి పైనే

పాపులార్టీ అంటే ఇదే.. ఒక్క పోస్టుకు రూ. కోటి పైనే

నెట్టింట్లో సెలబ్రిటీలు ఏం చేసినా అదొక వైరల్ న్యూసే. ప్రశంసలైనా, విమర్శలైనా వారికి ఖర్చు లేని పబ్లిసిటీ. సెలబ్రిటీలందరిలోనూ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మాత్రం కాస్త ప్రత్యేకం. తనకంటే చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏది చేసినా వార్తే అవుతోంది. ఈ మధ్య  తన తల్లి, భర్తతో కలిసి సిగరెట్ పీల్చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో  కన్పించడంతో విమర్శలు కూడా ఎదుర్కొన్నది. ఇలా ఎవరికీ అందనంత పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టగానే క్షణాల్లో లక్షలాది లైకులు, కామెంట్లు వచ్చేస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఉన్న ఫాలోయర్ల సంఖ్య 4 కోట్లు. ఇలా తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటోందీ బ్యూటీ. తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే ఒక్కో పోస్ట్ కు కోట్లల్లో సంపాదిస్తోంది. పాపులర్ బ్రాండ్ వస్తువులను ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోట్ చేస్తూ.. ఒక్కో పోస్టుకు రూ.1.86 కోట్లను వసూలు చేస్తోంది. ఈ పోస్టుల ద్వారా ప్రపంచంలో సంపాదిస్తున్న వ్యక్తుల్లో ప్రియాంకది 19 వ స్థానం. ఒక్క పోస్ట్ తో కోట్లు సంపాదిస్తోన్న వారిలో బాలీవుడ్ నుంచి ఈమె ఒక్కతే కావడం విశేషం.