ఐదు నెలలకే పుట్టిండు.. 816 గ్రాముల పసికందుకు పునర్జన్మ

ఐదు నెలలకే పుట్టిండు.. 816 గ్రాముల పసికందుకు పునర్జన్మ

పద్మారావునగర్, వెలుగు: కేవలం 25 వారాల గర్భధారణలో 816 గ్రాముల బరువుతో జన్మించిన పసికందుకు సికింద్రాబాద్‌‌లోని మెడికవర్ ఆస్పత్రి డాక్టర్లు ప్రాణం పోశారు. ఈ విషయాన్ని బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గర్భధారణ సమయంలో తల్లి తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో బాధపడటంతో మగ శిశువు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో శ్వాసకోశ సమస్యలతో జన్మించాడని తెలిపారు.

వెంటనే చిన్నారిని ఎన్‌‌ఐసీయూలో చేర్చి అత్యాధునిక శ్వాసకోశ సపోర్ట్‌‌తో పాటు టోటల్ పేరెంటరల్ న్యూట్రిషన్ అందించామని చెప్పారు. డాక్టర్ల పర్యవేక్షణ, కంగారూ మదర్ కేర్, తల్లిపాల సహకారంతో శిశువు పూర్తిగా కోలుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చిన్నారి బరువు పెరగడంతో డిశ్చార్జ్ చేసినట్లు సీనియర్ నియోనాటాలజిస్ట్ దీపా ధరణప్ప శెట్టి తెలిపారు.