జ్వరంతో ఆస్పత్రికి.. వైద్యం వికటించి బాలుడి మృతి

జ్వరంతో ఆస్పత్రికి.. వైద్యం వికటించి బాలుడి మృతి

రంగారెడ్డి: యాచారం మండల కేంద్రంలో వైద్యం వికటించి చరణ్ తేజ్(12) అనే బాలుడు
మృతి చెందాడు. మండల పరిధిలోని మల్కిజ్ గూడ గ్రామానికి చెందిన వరికుప్పల ఈదయ్య, ఈదమ్మ
దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు (చరణ్ తేజ్) ఉన్నారు. రెండు రోజుల క్రితం చరణ్ తేజ్‌కి తీవ్రంగా జ్వరం రావడంతో యాచారంలోని జ్యోతి క్లినిక్‌కు తీసుకువచ్చారు. డాక్టర్ జ్యోతి రెడ్డి బాలుడికి చికిత్స చేసి ఇంటికి పంపించింది. ఇంటికి వెళ్లిన తర్వాత చరణ్ తేజ్‌కు మళ్ళీ జ్వరం రావడంతో మరోసారి హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. అప్పుడు డాక్టర్ జ్యోతి రెడ్డి ఆ బాలుడికి గ్లూకోజ్ పెట్టి రెండు ఇంజక్షన్‌లు ఇచ్చింది. ఆ తర్వాత కూడా చరణ్ తేజ్‌కి జ్వరం యధావిధిగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే బాలుడు మృతి చెందాడని అక్కడి వైద్యులు చెప్పారు. దీనితో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు జ్యోతి క్లినిక్ దగ్గరికి వచ్చి ధర్నా చేపట్టారు. జ్యోతి రెడ్డి యాచారం ప్రభుత్వ హాస్పిటల్‌లో వైద్యురాలుగా పనిచేస్తూ ఈ ప్రైవేట్ క్లినిక్‌ను నడుపుతున్నట్లు సమాచారం.