షీ జిన్‌పింగ్‌కు ఏమైంది?.. బ్రిక్స్ సమావేశంలో అసౌకర్యంగా ఫీలైన చైనా ప్రెజ్.. స్పీచ్ అపి పరామర్శించిన ప్రధాని మోదీ 

షీ జిన్‌పింగ్‌కు ఏమైంది?.. బ్రిక్స్ సమావేశంలో అసౌకర్యంగా ఫీలైన చైనా ప్రెజ్.. స్పీచ్ అపి పరామర్శించిన ప్రధాని మోదీ 

దేశరాజధాని ఢిల్లీలో జరిగిన  బ్రిక్స్ సదస్సులో ఆసక్తికరమైన, అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకుంది. బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా వివిధ దేశాలతో  జరిగిన మీటింగ్ లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అసౌకర్యానికి గురయ్యారు. శనివారం  సాయంత్రం జరిగిన ఈ ఆసక్తికర ఘటనతో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ఆపి  జిన్ పింగ్ ను  పరామర్శించారు. జిన్ పిం్ ఎందుకు అసౌకర్యంగా ఫీలయ్యారు అనే విషయం ఇంక సస్పెన్స్ గానే ఉంది. 

ప్రధాని మోదీ మాట్లాడుతుండగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్   ఉన్నట్టుండి అసౌకర్యానికి గురయ్యారు. ఇది గమనించిన ప్రధాని మోదీ  ఏమందంటూ జిన్ పింగ్ ను పలకరించారు. జిన్ పింగ్ నుంచి  స్పందన లేకపోవడంతో.. అతని ట్రాన్స్ లేటర్ ను మరోసారి ప్రశ్నించాడు. దీంతో  అంతాబాగానే ఉందంటూ  అని జిన్ పింగ్  తలఊపడంతో  తిరిగి తన స్పీచ్ ను ప్రారంభించారు ప్రధాని మోదీ. 

చైనా అధ్యక్షుడు జిన్ పింక్ అసౌకర్యానికి స్పష్టమైన కారణాలు తెలిసిరాన్నప్పటికీ.. మైక్ కారణంగాగానీ, అనువాదానికి సంబంధించిగానీ కొంత అసౌకర్యానికి గురైనట్టు తెలుస్తోంది. ఇది చైనాగానీ, ఇండియా ప్రతినిధులు గానీ బహిర్గతం చేయలేదు. శనివారం సాయంత్రం 4.40 గంటలనుంచి 5.11గంటల మద్య ప్రధాని మోదీ,  జిన్ పింగ్ మధ్య సంభాషణ జరిగినట్టు దూరదర్శన్ షేర్ చేసిన ఫుటేజ్ లో కనిపించింది. 

ఏడేళ్లలో జిన్ పింగ్ తొలిసారిగా భారత్ ను సందర్శిస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బ్రిక్స్ సదస్సులో ఈ ఇద్దరు నేతల మధ్య ఇటీవల జరిగిన అనేక సంభాషణలలో ఇది కూడా ఒకటిగా చేరింది.