న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ఎంతో ఘనంగా జరుగుతున్న 18వ బ్రిక్య్స్ (BRICS) సమ్మిట్ వేదికగా భారత క్రికెట్ దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ రాజనీతిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రదర్శిస్తున్న దౌత్య నీతికి మైండ్ బ్లాక్ అయిందంటూ రవిశాస్త్రి సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
పుతిన్, జిన్‌పింగ్‌ల ముందే సలామ్:
బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో కలిసి మోడీ మొక్కలు నాటుతున్న అరుదైన ఫోటోను రవిశాస్త్రి 'ఎక్స్' (ట్విట్టర్)లో పంచుకున్నారు. ఒక్క భారతీయుడిగా ఇంతగా గర్వపడే క్షణం ఎప్పుడూ రాలేదు.. పుతిన్, జిన్‌పింగ్‌ల సమక్షంలో మన ప్రధాని మోడీ భారత మాత ఒడిలో అంతర్జాతీయ దౌత్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. టేక్ ఏ బో, మోడీ జీ! అంటూ రవిశాస్త్రి చేసిన పోస్ట్ ఇప్పుడు గ్లోబల్ లెవల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీ డిక్లరేషన్ సంచలనం:
సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ అధ్యక్షతన జరుగుతున్న ఈ బ్రిక్య్స్ సదస్సులో న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026ను సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించాయి. ప్రపంచవ్యాప్తంగా 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల ప్రతినిధులు హాజరైన ఈ సమ్మిట్‌లో గ్లోబల్ గవర్నెన్స్, బహుళ పక్ష సంబంధాలపై చర్చించారు. ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో పాటు మరో ఏడు దేశాల అధినేతలతో దౌత్యపరమైన ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు.
క్రికెట్ నుంచి గ్లోబల్ పాలిటిక్స్ వరకు:
టీమిండియా తరఫున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడి, హెడ్ కోచ్‌గా జట్టును ఎన్నో చారిత్రాత్మక విజయాల వైపు నడిపిన రవిశాస్త్రి క్రికెట్ రంగాన్నే కాక ప్రపంచ రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తుంటారు. ప్రపంచ వేదికపై మోడీ గ్లోబల్ లీడర్‌షిప్‌ను విమర్శకులు కూడా మెచ్చుకునేలా చేస్తున్న తరుణంలో, రవిశాస్త్రి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు క్రీడా, రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి.
Never felt prouder as an Indian. President Putin. President Xi. And our Magnificent Prime Minister Narendra Modi together in Mother India. International diplomacy like never before. Take a Bow. Modi Ji pic.twitter.com/RfINH8SiAB
— Ravi Shastri (@RaviShastriOfc) September 12, 2026
