ఎమ్మెల్సీలంతా సభకు రావాలి.. పార్టీలైన్కు కట్టుబడాలి :  ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ 

ఎమ్మెల్సీలంతా సభకు రావాలి.. పార్టీలైన్కు కట్టుబడాలి :  ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ 
  • పార్టీ ఎమ్మెల్సీలకు బీఆర్​ఎస్​ మూడు లైన్ల విప్​ జారీ

హైదరాబాద్​, వెలుగు: ఎమ్మెల్సీలందరూ మంగళవారం కచ్చితంగా మండలి సమావేశాలకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఎవరూ సభకు ఎగ్గొట్టొద్దని, చర్చల్లో పాల్గొనాలని తేల్చి చెప్పింది. సోమవారం బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్​ ఈ మేరకు మూడు లైన్ల విప్​ జారీ చేశారు. సభ వాయిదా పడే వరకు సభలోనే ఉండాలని స్పష్టం చేశారు. పార్టీ విధానాలు, స్టాండ్​కు తగ్గట్టుగా చర్చల్లో పాల్గొనాలని సూచించారు. ఏవైనా బిల్లులు, మోషన్లపై బీఆర్​ఎస్​ స్టాండ్​ మేరకు ఓటింగ్​ వేయాలన్నారు. ఫ్లోర్​లో జరిగిన ఓటింగ్​లోనూ పార్టీ లైన్​కు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.