ఏ తప్పూ చేయలేదని బండి సంజయ్ ప్రమాణం చేయాలి : బీఆర్‌‌‌‌ఎస్ మహిళా నేతలు

ఏ తప్పూ చేయలేదని బండి సంజయ్ ప్రమాణం చేయాలి : బీఆర్‌‌‌‌ఎస్ మహిళా నేతలు
  •     ఇందుకు తనకు ఎంతో ఇష్టమైన భాగ్యలక్ష్మి అమ్మవారి వద్దకు రావాలి 
  •     బీఆర్ఎస్ మహిళా నేతల డిమాండ్

చార్మినార్​ వెలుగు: రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు, వేధింపులు జరగకుండా చూడాలని, నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా చేయాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని బీఆర్‌‌‌‌ఎస్ మహిళా నేతలు వేడుకున్నారు. బీఆర్‌‌‌‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, జిల్లా పరిషత్ మాజీ చైర్​పర్సన్ తుల ఉమ కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారిని సోమవారం దర్శించుకున్నారు. 

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. పోక్సో కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని, అధికార బలంతో కొడుకును రక్షించుకునే ప్రయత్నం చేయడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ భావిస్తే.. ఆయనకు ఎంతో ఇష్టమైన భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.