ఏడాది పాటు బంగారం కొనొద్దు..ప్రజలకు బూర నర్సయ్య విజ్ఞప్తి

ఏడాది పాటు బంగారం కొనొద్దు..ప్రజలకు బూర నర్సయ్య విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ చెప్పినట్లుగా ప్రజలు ఏడాది పాటు బంగారం కొనొద్దని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పిలుపునిచ్చారు. ప్రధాని సూచించిన సప్త సూత్రాలు, సప్త పరివర్తనను ప్రతి పౌరుడు పాటించాలని కోరారు. మన దేశం డెవలపింగ్ నేషన్ నుంచి డెవలప్డ్ నేషన్ గా ఎదగాలంటే ఆర్థిక స్థిరత్వం అత్యంత కీలకమని చెప్పారు. ‘దేశంలో ఏటా 700 బిలియన్ డాలర్ల దిగుమతులు జరుగుతుంటే, ఎగుమతులు 400 బిలియన్ డాలర్లే ఉన్నాయి. దీనివల్ల రూ. 25 లక్షల కోట్ల ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఇది మన రూపాయి విలువను దెబ్బతీస్తోందన్నారు.

ఈ లోటును తగ్గించేందుకు ప్రధాని సూచించిన ఏడు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. భారత్ ఏటా రూ. 6 లక్షల కోట్ల విలువైన 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఏడాది పాటు కొత్తగా బంగారం కొనడం వాయిదా వేస్తే భారీగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.  పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, కార్ పూలింగ్ వాడితే 20% వాడకం తగ్గి.. రూ. 4 లక్షల కోట్లు ఆదా అవుతాయి. ఐటీ వంటి రంగాల్లో కనీసం 25% వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తే రూ.12వేల కోట్ల విదేశీ కరెన్సీని ఆదా చేయవచ్చు. ప్రకృతి వ్యవసాయం ద్వారా 20% దిగుమతులు తగ్గించినా భూమికి, రైతుకు మేలు జరుగుతుంది. ఒక్క ఏడాది మన దేశంలోని పర్యాటక ప్రాంతాలనే సందర్శించాలి’ అని ప్రజలను బూర నర్సయ్య కోరార