మూడు నెలల్లో ఫైజర్..10 కోట్ల డోసులకు అమెరికా ఒప్పందం

మూడు నెలల్లో ఫైజర్..10 కోట్ల డోసులకు అమెరికా ఒప్పందం
  • 10 కోట్ల డోసులకు అమెరికా ప్రభుత్వం ఒప్పందం
  •  అక్టోబర్ నాటికి రెగ్యులేటరీ అప్రూవల్స్ పొందాలని నిర్ణయం
  •  మొత్తంగా 130 కోట్ల డోసులు తయారు చేసేందుకు రెడీ
  •  వచ్చే ఏడాది మొదటి నుంచి మోడర్నా వ్యాక్సిన్ 50 కోట్ల డోసులు ఇవ్వడమే టార్గెట్

ప్రస్తుతం కరోనా కేసులకు సంబంధించి మొదటి స్థానంలో ఉంది అమెరికా. మహమ్మారిని అంతం చేసేందుకు అంతే వేగంగా ఆ దేశ కంపెనీలు, సైంటిస్టులు పనిచేస్తున్నారు. ఇప్పటికే రెమ్డెసివిర్ వంటి మందులను సీరియస్ పేషెంట్లకు వాడుతున్నారు. వ్యాక్సిన్ తయారీలోనూ అంతే వేగంగా పనిచేస్తున్నారు. ఆ విషయంలో ఫైజర్, మోడర్నా కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. వ్యాక్సిన్ తయారీని మోడర్నానే ముందు ప్రకటించినా.. తయారీ విషయంలో మాత్రం ఫైజర్ కంపెనీనే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ను ఇచ్చేలా అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఫైజర్. ఫైజర్టార్ట్గె .. 130 కోట్ల డోసులు జర్మనీకి చెందిన బయోఎన్టెక్ అనే సంస్థతో కలిసి ఫైజర్ బీఎన్టీ162బీ2 అనే వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది. ఇది ఎంఆర్ఎన్ఏ ఆధారంగానే తయారవుతున్న వ్యాక్సిన్. ఈ టెక్నాలజీతో ఇప్పటికే బయోఎన్ టెక్ అనే కంపెనీ కేన్సర్ వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది. అదింకా ప్రయోగాల దశలోనే ఉంది. వ్యాక్సిన్కు సంబంధించి ఫైజర్ తో 200 కోట్ల డాలర్ల ఒప్పందం చేసుకుంది అమెరికా ప్రభుత్వం. ఈ ఏడాది చివరి నాటికి 10 కోట్ల డోసులు ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. దానికి తగ్గట్టు జులై 27న ఫేజ్2, ఫేజ్3 కంబైన్డ్ ట్రయల్స్ను కంపెనీ మొదలుపెట్టింది. అమెరికాలోని 39 రాష్ట్రాలకు చెందిన 30 వేల మందిపై ట్రయల్స్ చేస్తోంది. అక్టోబర్ నాటికి రెగ్యులేటరీ అప్రూవల్స్ పొందాలనిటార్ట్గె ఎట్టుకుం ది. అనుకున్నది అనుకు న్నట్టు జరిగితే 2021 డిసెంబర్ నాటికి 130 కోట్ల డోసులను తయారు చేయనుంది. ఫేజ్1/2 ట్రయల్స్ డేటా ప్రకారం వ్యాక్సిన్ తో మంచి ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చి నట్టు కంపెనీ చెబుతోంది. టీ సెల్స్ యాక్వేట్టి అవ్వడంతో పాటు యాంటీబాడీలూ తయార య్యాయని అంటోంది.

మోడర్నా కేరాఫ్ ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్

నేషనల్ ఇనిస్టి ట్యూట్స్ఆఫ్ హెల్త్తో కలిసి ఎంఆర్ ఎన్ ఏ1273 అనే వ్యాక్సిన్ను డెవలప్ చేస్తోంది మోడర్నా ఐఎన్సీ. ఇప్పటికే ఆ వ్యాక్సిన్కు సంబంధించిన ఫేజ్3 ట్రయల్స్ మొదలయ్యాయి. జులై 27 నుంచి 30 వేల మందికిపైగా వలంటీలకు ఆ వ్యా క్సిన్ను ఇచ్చి టెస్ట్ చేస్తున్నారు. దాంతో పాటే ఫేజ్2 ట్రయల్స్లో వచ్చిన ఫలితాలనూ మానిటర్చేస్తున్నా రు. ఇమ్యూనిటీకి వెన్నెముకలా ఉండే టీ సెల్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు యాంటీబాడీలూ బాగా తయారయ్యాయని సైంటిస్టులు చెబుతున్నా రు. ఈ ఏడాది చివరి నాటికి ఫేజ్3 ట్రయల్స్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది మోడర్నా కంపెనీ. అంతా సక్సెస్ అయితే.. 2021 ప్రారంభం నుంచి 50 కోట్లడోసులు ఇస్తామని చెప్పింది. వ్యాక్సిన్ల తయారీ కోసం స్విట్జర్లాండ్కు చెందిన లోంజా అనే కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఏటా వంద కోట్ల డోసులను ఆ కంపెనీ తయారు చేయనుంది. వ్యాక్సిన్ సక్సెస్ అయితే.. ప్రపంచంలోనే ఫస్ట్ ఎంఆర్ఎన్ ఏ వ్యాక్సిన్గా ఇది చరిత్ర సృష్టించనుంది. అయితే, డిసెంబర్ చివరి నాటికే ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వాలన్న టార్గెట్   పెట్టుకోవడంతో రేస్ మరింత పోటాపోటీగా మారింది.