
‘సత్యభామ’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న కాజల్ అగర్వాల్.. తాజాగా మరో కొత్త చిత్రానికి సైన్ చేసింది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఇందులో ఆమె కీలకపాత్రను పోషిస్తున్నట్టు శుక్రవారం మేకర్స్ కన్‌ఫర్మ్ చేశారు. ప్రభాస్ ఇటీవల ఈ మూవీ సెట్స్‌లో జాయిన్ అవగా, అక్షయ్ కుమార్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేశారు.
మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఇప్పుడిక కాజల్ కూడా జాయిన్ అయింది. మొత్తానికి ఒక్కో అప్‌డేట్‌తో ట్రెండ్ అవుతోంది ‘కన్నప్ప’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మే 20న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టీజర్‌ను లాంచ్ చేయబోతున్నారు. ఇక గతంలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ బ్రదర్ అండ్ సిస్టర్‌గా ‘మోసగాళ్లు’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.