
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లిన పూజాహెగ్డే.. గత కొంత కాలంగా రేసులో కొంత వెనుకబడింది. వరుస పరాజయాలు పలకరించడంతో అవకాశాలు కూడా తగ్గాయి. అయితే తాజాగా కోలీవుడ్ నుంచి ఆమెకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. సూర్యకు జంటగా ఆమె ఓ చిత్రంలో నటించబోతోంది. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్‌గా పూజాహెగ్డేను ఫైనల్ చేసినట్టు సమాచారం.
అతి త్వరలో దీనిపై అనౌన్స్‌మెంట్ రానుంది. సూర్య కెరీర్‌లో ఇది 44వ చిత్రం. జూన్ ఫస్ట్ వీక్ నుంచి అండమాన్ దీవుల్లో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆ తర్వాత ఊటీ, తమిళనాడులోని ఇతర ప్రదేశాలలో 40 రోజుల లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. మలయాళ నటుడు జోజు జార్జ్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
సూర్యకు చెందిన 2డి ఎంటర్‌టైన్‌మెంట్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు చెందిన స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. విజయ్ ‘బీస్ట్’ తర్వాత తమిళంలో పూజ నటిస్తున్న సినిమా ఇదే కానుంది. స్ట్రగుల్స్‌లో ఉన్న పూజా హెగ్డే కెరీర్‌కు ఈ సినిమా ఎంతో కీలకం కానుంది.