సౌతాఫ్రికా Vs ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఎవరు గెలిచారు అంటే.. మ్యాచ్ టై అయ్యింది. అవును.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 187 పరుగులు చేసింది. ఆ తర్వాత 188 పరుగుల విక్టరీ టార్గెట్ ఛేజ్ కోసం బరిలోకి దిగిన ఆఫ్గనిస్తాన్ జట్టు సరిగ్గా 187 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 19 ఓవర్ల 4 బంతులు ఆడిన ఆఫ్గనిస్తాన్.. 187 పరుగులు చేయటంతో.. మ్యాచ్ టై అయ్యింది.
ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లు గెలిచినంత పని చేశారు. 15 ఓవర్ల వరకు ఆఫ్గనిస్తాన్ ఓటమి ఖాయం అనుకున్నారు అందరూ. 15 ఓవర్లలో ఆఫ్గనిస్తాన్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి.. గెలుపునకు కావాల్సింది 49 పరుగులు. 30 బంతుల్లో.. 49 పరుగులు చేయాలి. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు దూకుడుగా ఆడారు.
ALSO READ : ఇది మూములు దెబ్బ కాదు భారీ ఎదురు దెబ్బ
రషీద్ ఖాన్ 12 బంతుల్లో 20 పరుగులు.. నూర్ అహ్మద్ 9 బంతుల్లో 15 పరుగులు, ఓమర్జాయ్ 17 బంతుల్లో 22 పరుగులు చేయటంతో విజయం అంచుల వరకు వచ్చింది.
చేతిలో ఒకే ఒక్క వికెట్.. 2 బంతులు ఉన్నాయి.. ఒక్క పరుగు చేస్తే విజయం ఆఫ్గనిస్తాన్ వైపే.. సరిగ్గా ఇదే సమయంలో లాస్ట్ బ్యాటర్ ఫరూఖీ రన్ ఔట్ అయ్యాడు.. దీంతో మ్యాచ్ టైగా మారింది.
