కొలంబో: ఇండియాతో కలిసి టీ20 వరల్డ్ కప్ 2026కు అతిథ్యం ఇస్తోన్న శ్రీలంకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. తొడ కండరాల గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ వానిందు హసరంగా టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. ఎడమ తొడ కండరాల్లో తీవ్రమైన గాయం కావడంతో హసరంగా మెగా టోర్నీ నుంచి వైదొలిగినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.
అతని స్థానంలో దుషన్ హేమంతను రిప్లేస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంచి ఫామ్‌లో ఉన్న హసరంగా కీలకమైన వర్డల్ కప్‌కు దూరం కావడం శ్రీలంకు మూములు దెబ్బ కాదు భారీ ఎదురు దెబ్బే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
►ALSO READ | ఇండియాతో మ్యాచ్ పెద్ద మ్యాటరే కాదు.. చాలా లైట్: పాక్ ప్లేయర్ ఓవరాక్షన్
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంక, ఐర్లాండ్ తలపడ్డ విషయం తెలిసిందే. శ్రీలంక 20 పరుగుల తేడాతో గెలిచినా ఈ మ్యాచులోనే హసరంగా గాయపడ్డాడు. బౌలింగ్ వేసే సమయంలో తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. అయినప్పటికీ గాయాన్ని లెక్క చేయకుండా బౌలింగ్ కంటిన్యూ చేశాడు. నొప్పితో బాధపడుతూనే మూడు వికెట్లు తీసి శ్రీలంక విజయంలో కీలక పాత్ర పోషించాడు.
