రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న ఓ మెక్‌డొనాల్డ్స్ హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ప్రజల ఆరోగ్యాన్ని పక్కనపెట్టి నిబంధనలకు విరుద్ధంగా ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
తనిఖీల్లో బయటపడ్డవి:
ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి వేయించడానికి వాడుతున్న నూనె చాలా నాసిరకంగా ఉందని తేలింది. సాధారణంగా నూనెలో ఉండాల్సిన నాణ్యత (TPC) 25% కంటే తక్కువ ఉండాలి. కానీ ఇక్కడ శాఖాహార వంటలకు 31%, మాంసాహార వంటలకు 28% ఉన్నట్లు గుర్తించారు.
నూనె రంగు పూర్తిగా మారిపోయినా సరే, అలాగే వాడుతున్నారు. ఇలాంటి నూనె తింటే గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో అధికారులు సుమారు 40 లీటర్ల నూనెను అక్కడికక్కడే పారబోయించారు.
ALSO READ : 70 ఏళ్ల వయసులో గూగుల్ మాజీ బాస్ ప్రేమాయణం..
కుళ్ళిన టమోటాలు: కోల్డ్ స్టోరేజ్ ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన దాదాపు 40 కిలోల కుళ్ళిన టమోటాలను అధికారులు గుర్తించి వాటిని పారవేశారు.
అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నందుకు హోటల్ మేనేజర్‌కు అధికారులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
