నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  •      గెలిస్తే అర్జునుడిని.. ఓడితే అభిమన్యుడిని 

జగిత్యాల, వెలుగు :  నిజామాబాద్ నుంచి పోటీ చేయడం అంటే పద్మ వ్యూహంలోకి అడుగుపెట్టడమేనని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. అక్కడ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీని నిలువరించేందుకు బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కలిసి కుట్రలు చేశాయని ఆరోపించారు. ఈ ఎన్నికల పోరాటంలో గెలిస్తే అర్జునుడిలా, ఓడితే అభిమన్యుడిలా చరిత్ర పుటల్లో నిలుస్తానని పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాలలో మీడియాతో ఆయన మాట్లాడారు.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అమ్ముడుపోయిందని విమర్శించారు. పార్టీని బీజేపీకి కుదువపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉనికి కోసం బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ దొంగ దీక్షలు చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ రైతు దీక్ష చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు. వరి వేస్తే ఉరి అన్న కేసీఆర్ పాలనలో సన్న రకాలు సాగు చేయకపోతే ధాన్యం కొనుగోలు చేయబోమని తూములు కూడా బంద్ పెట్టారని గుర్తుచేశారు.

వరికి రూ.500 బోనస్‌‌‌‌‌‌‌‌పై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రూ.2 లక్షల రుణ మాఫీచేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ రూపొందించారని వివరించారు. డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీరు విడుదల చేసి పంటలను కాపాడామని వెల్లడించారు.