టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ గుంపులు గుంపులుగా వచ్చి వాలిపోతుంటారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఓ సంఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది. అక్కడ పరిస్థితి కంట్రోల్ తప్పడంతో పోలీసులు చివరికి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే... బెంగళూరులోని కిమ్స్ (KIMS) ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న వందల మంది ఫ్యాన్స్ అభిమాన హీరోని చూడటానికి ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. ఎన్టీఆర్ లోపలికి వస్తున్న సమయంలో ఆయనను దగ్గరగా చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. జనం ఒక్కసారిగా ఎస్కలేటర్ వైపు దూసుకువెళ్లడంతో, ఎస్కలేటర్ విరిగిపోయినట్లు తెలుస్తుంది.
దింతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టడానికి లాఠీలు వాడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ సురక్షితంగా వెళ్లేందుకు ప్రత్యేక రూట్ ఏర్పాటు చేశారు. ఇంత గందరగోళం ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ మాత్రం అతని కారు సన్‌రూఫ్ నుండి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు.
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా అప్‌డేట్స్
ప్రస్తుతం ఎన్టీఆర్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు 'డ్రాగన్' అనే పేరు వినిపిస్తోంది. మొదట రాజమౌళి ఈ పేరును ప్రస్తావించినప్పటికీ, నిర్మాత రవి యెర్నేని మాత్రం ఇది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని, అసలు పేరు ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. ఈ సినిమా షూటింగ్ 2024 మొదట్లోనే స్టార్ట్ కావాల్సి ఉన్నా, రకరకాల కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. షెడ్యూల్స్ మధ్య గ్యాప్ రావడం వల్ల అనుకున్న సమయానికి సినిమా పూర్తి కావట్లేదు. అలాగే షూటింగ్ కోసం ఆయన జోర్డాన్ కూడా వెళ్లారు. అక్టోబర్ చివరి వారం నుండి మళ్లీ షూటింగ్ స్పీడ్ అందుకోనుంది.
Adhem Crowd Raa Samiii 🙏🏻🙏🏻.
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) March 8, 2026
Escalator Kuda Virigi Poyindhi Kadha!!!#NTRInBengaluru pic.twitter.com/bi7YE12BS1
