డిజిటల్ అరెస్ట్ లో రిటైర్డ్ జడ్జి.. కోటి 66 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

డిజిటల్ అరెస్ట్ లో రిటైర్డ్ జడ్జి.. కోటి 66 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

ఆయన రిటైర్డ్ జడ్జి.. ఎన్నో తీర్పు చెప్పారు.. వేలు, లక్షల సంఖ్యలో కేసులను చూశారు.. ప్రస్తుతం పదవీ వివరణ చేసి.. ఇంట్లోనే ఉంటున్నారు ఆ రిటైర్డ్ జడ్జి. ఆయన్ను టార్గెట్ చేశారు సైబర్ క్రిమినల్.. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఏకంగా కోటి 66 లక్షల రూపాయలు కొట్టేశారు ఆయన నుంచి. డబ్బులు పోయిన తర్వాత.. అసలు విషయం తెలిసి పోలీసులకు కంప్లయింట్ చేశారు ఆ రిటైర్డ్ జడ్జి. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొన్ని రోజుల క్రితం మనీ లాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసుల పేరుతో.. రిటైర్డ్ జడ్జి ఓ కాల్ వచ్చింది. అది వీడియో కాల్. మీపై ఈ కేసులు ఉన్నాయని.. సీబీఐ నుంచి కాల్ చేస్తున్నామంటూ వీడియో కాల్ చేశారు. మీపై కర్నాటక రాష్ట్రం బెంగళూరు సిటీలోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ లో మీపై కేసులు నమోదు అయ్యాయని చెప్పుకొచ్చారు సైబర్ కేటుగాళ్లు. 

మానవ అక్రమ రవాణా కేసులో మీపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయ్యింది అని చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉన్న మీ రెండు ఫోన్ నెంబర్ల నుంచి మహిళలకు అసభ్యకరమైన కాల్స్ వస్తున్నాయంటూ రిటైర్డ్ జడ్జిని భయపెట్టారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు.. పోలీసులకు చెప్పొద్దని.. అలా చేస్తే ఇప్పుడే అరెస్ట్ చేస్తామని.. డిజిటల్ అరెస్ట్ తో ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చారు సైబర్ క్రిమినల్.

నకిలీ సీబీఐ అధికారులకు భయపడిన ఆ రిటైర్డ్ జడ్జి.. డిజిటల్ అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పారు.. వాళ్లు చెప్పిన అకౌంట్ కు కోటి 66 లక్షల రూపాయలు బదిలీ చేశారు.. విచారణ తర్వాత డబ్బులు తిరిగి వస్తాయంటూ నమ్మించారు. కోటి 66 లక్షలు బదిలీ చేసిన తర్వాత.. ఆ అధికారుల ఫోన్లు పని చేయకపోవటంతో మోసపోయినట్లు గుర్తించిన రిటైర్డ్ జడ్జి.. హైదరాబాద్ సిటీలోని నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు.. సైబర్ సెక్యూరిటీ వింగ్ అధికారులు.. విచారణ చేస్తున్నారు.