ఆయిల్ ధరల మంటతో.. తగ్గిన బంగారం, వెండి ధరలు

ఆయిల్ ధరల మంటతో.. తగ్గిన బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్ధం రోజుకో రూపం తీసుకుంటోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులతో భయపడకుండా అదే రీతిలో ఆ దేశం రియాక్ట్ కావటంతో పరిస్థితులు దిగజారుతున్నాయి. అయినప్పటికీ సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుదలను నమోదు చేశాయి. యుద్ధం స్టార్ట్ అయిన వారం రోజుల నుంచి ఇదే ధోరణి కొనసాగటంతో భారతీయ షాపర్లు సంతోషంగా ఉన్నారు. ఇవాళ షాపింగ్ చేయటానికి వెళ్లాలనుకుంటున్న వారు తమ ప్రాంతంలో తగ్గిన రేట్లను గమనించండి. 

మార్చి 9న బంగారం రేట్లు తగ్గాయి. దీంతో మార్చి 8 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.196 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 168గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 820గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ALSO READ : డిజిటల్ అరెస్ట్ లో రిటైర్డ్ జడ్జి.. కోటి 66 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

ఇక వెండి విషయానికి వస్తే  మార్చి 9, 2026న దేశవ్యాప్తంగా రేట్లు తగ్గాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 90వేల వద్ద ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.290 వద్ద ఉంది.