శ్రీరామనవమి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు.. మిథిలీ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలన

 శ్రీరామనవమి ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు.. మిథిలీ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలన
  • భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​ అంకిత్
  •  సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి ఏర్పాట్లు పరిశీలన

భద్రాచలం, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి మిథిలా స్టేడియంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం వేడుకలను తిలకించేందుకు వచ్చే భక్తులకు చలువ పందిళ్లు, తాగునీరు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కల్యాణ మండపంలో పాలీహౌస్‌‌లను ఏర్పాటు చేసి చల్లని వాతావరణం కల్పిస్తున్నట్లు వివరించారు. కల్యాణ మండపంలోని ప్రతి సెక్టార్‌‌కు భక్తుల కోసం ఒక అధికారి బాధ్యతలు చేపడతారని వెల్లడించారు.

పట్టణంలో ఫ్లెక్సీలు, రూట్ మ్యాప్‌‌లు, సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. భక్తులందరికీ ప్రసాదం, తలంబ్రాలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తినుబండారాల నాణ్యతను పరిశీలించేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట భద్రాద్రి ఆలయ ఈవో దామోదర్‌‌రావు, ఈఈ రవీందర్ ఉన్నారు.